లడ్డూలు, అరిసెలు, బూందీ, కారప్పూస, ఇంకా.. జంతికలు! :)

ఈ ఫోటోలలోవన్నీ నిజంగా చేసినవే! పెళ్ళప్పుడు మా ఇంట్లో చేశారు. తయారు చేయగానే వేడి వేడిగా ఉన్నవాటిని ఫ్యాన్ కింద ఆరబెట్టమనే పని మాకు అప్పగించారు. నేనూ, మా తమ్ముడూ కలిసి ఇలా పద్ధతిగా ఆరబెట్టడమే కాకుండా ఫోటోలు కూడా తీశాం. ఇంకా మడత కాజాలు, పంచదార చిలకలు లాంటి వేరే స్వీట్లు కూడా చేశారు గానీ, అప్పుడు నాకు ఫోటోలు తీయడం కుదరలేదు. :(












16 comments:

వేణూశ్రీకాంత్ said...

ఆహా!! మధురాతిమధురం :-)

Overwhelmed said...

ori nayano. inni chesara? mi pelli ki saare na idi?

నేస్తం said...

ఎక్కడ తీసావ్ అమ్మాయ్ ఈ ఫొటోస్

సవ్వడి said...

ఎక్కడ తీసావ్.... baagunnaay!

మాలా కుమార్ said...

ఫొటోలు బాగున్నాయి .

Rams said...

Vivaha Bojanmbu song lo

Oka Sanni Vesam Gurtuku Vachnadandi...

Rams said...

Very Nice

ఇందు said...

నాకెందుకో ఇవన్నీ మీరు చేసినవి కాక ఎక్కొడో తీసినవి అనిపిస్తోంది :P ....కాని భలె నూరూరిస్తున్నాయ్! :)

హరే కృష్ణ said...

నిజం చెప్పండి మీకు ఫోటో షాప్ వచ్చు కదా

మధురవాణి said...

@ వేణూశ్రీకాంత్, మాలా కుమార్, Rams,
ధన్యవాదాలు! :)

@ జాబిలి, నేస్తం, సవ్వడి, ఇందు, హరేకృష్ణ,
ఈ ఫోటోలలోవన్నీ నిజంగా చేసినవే! పెళ్ళప్పుడు మా ఇంట్లో చేశారు. తయారు చేయగానే వేడి వేడిగా ఉన్నవాటిని ఫ్యాన్ కింద ఆరబెట్టమనే పని మాకు అప్పగించారు. నేనూ, మా తమ్ముడూ కలిసి ఇలా పద్ధతిగా ఆరబెట్టడమే కాకుండా ఫోటోలు కూడా తీశాం. ఇంకా మడత కాజాలు, పంచదార చిలకలు లాంటి వేరే స్వీట్లు కూడా చేశారు గానీ, అప్పుడు నాకు ఫోటోలు తీయడం కుదరలేదు. :(

@ హరే కృష్ణ,
నాకు ఫోటోషాప్ రాదనీ, అంటే ఇక్కడ వాడలేదనీ నమ్ముతారా ఇప్పుడైనా! ;)

హరే కృష్ణ said...

అదేం లేదు ఇంత పద్దతి గా ఆరబెట్టేసరికి డౌట్ వచ్చింది అంతే..
good job :)

హరీష్ బలగ said...

అబ్బబ్బా మధుర గారూ.. దయచేసి ఆ ఫోటో లు అక్కడనుండి తీసేద్దురూ.. నోరు వూరిపోతోంది.. కళ్ళముందు అన్ని కనిపిస్తున్నా తినలేని మా దురదృష్టాన్ని చూస్తే మీకు జాలి కలగడం లేదా?

swapna@kalalaprapancham said...

pellappudu intlo valle pelli ki saripada sweets cheyadam ante maatalu kaadu, pelli ante chala mandi vastaruga 1000's lo. inntha mandikaaa? really gr8 mi inti vallu

మధురవాణి said...

@ హరేకృష్ణ,
మా పనితనాన్ని మెచ్చుకున్నందుకు థాంక్యూ! :)

@ హరీష్,
ఆ మాటకొస్తే, నాదీ దురదృష్టమేనండీ.. ఇలా ఫోటోలు చూసి సంతోషించడం తప్పించి ఇప్పటికిప్పుడు లడ్డూలు, అరిసెలు కొనుక్కుందామన్నా ఇక్కడ దొరకవుగా! :( కాబట్టి, కనీసం చూసి అయినా సంతోష పడదాం.. ఏవంటారూ! ;)

@ స్వప్న,
ఆ స్వీట్లన్నీ మా అమ్మ ఒక్కరే చేయలేదండీ.. కొంతమంది వంట వాళ్ళతో పెట్టి, వాళ్ళతో కలిసి తయారు చేశారు.

కొత్త పాళీ said...

@మధురవాణి "కొనుక్కుందామన్నా ఇక్కడ దొరకవుగా!"
అందుకే అమెరికా వచ్చేసెయ్యండి. మా రాయల్ స్వీట్స్‌లో ఏం కావాలన్నా దొరుకుతై :)

మధురవాణి said...

@ కొత్తపాళీ,
అవునా.. అయితే ఈ విషయమేదో ఆలోచించాల్సిందే! మరీ స్వీట్ల కోసం అమెరికా వచ్చేస్తానంటే జనాల రియాక్షన్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా! :p