శోభాయమాన ప్రకృతి
అల్లన నీలాకాశంలో తేలియాడుతున్న తెల్లని మబ్బులు... ఆకాశాన్నంటుతున్నాయేమో అన్నట్టుగా మైమరపిస్తున్న పర్వత శిఖరాలు... క్రమశిక్షణ గల సైనికుల్లా వరుసలో ఠీవీగా నిలుచున్న పైన్ చెట్లు... వీటన్నిటి మధ్యన ముగ్ధమనోహరంగా కొలువుదీరిన చిన్న నీటి సరస్సు... అందమంతా మాదే అన్నట్టుగా సరస్సులో నిలిచిన పచ్చటి నీళ్లు... నీటిపై విలాసంగా కదలాడుతున్న వీటన్నిటి ప్రతిబింబాలు...
ప్రకృతిని మించిన సౌందర్యం... సృష్టికర్తని మించిన చిత్రకారుడు ఎవరుంటారు మరి.!!?
ప్రకృతిని మించిన సౌందర్యం... సృష్టికర్తని మించిన చిత్రకారుడు ఎవరుంటారు మరి.!!?
వినాయకచవితి పూజ
తుంటరి తుమ్మెదలు - 2
అనగనగా ఒక బుజ్జి తుమ్మెద మకరందం కోసం వెతుక్కుంటూ వెళ్లి ఒక అందమైన పువ్వుని చేరింది.
ఆ పువ్వులోని మకరందం మహా రుచిగా ఉందని, అదొక్కటే ఆరగించేయకుండా తన నేస్తాన్ని కూడా పిలిచింది. పిలవగానే జూ..జూమ్మంటూ వచ్చేసింది మరో బుజ్జి తుమ్మెద.
రెండు బుజ్జి తుమ్మెదలూ కలిసి హాయిగా విలాసంగా మకరందపు విందు ఆరగించేసాయి.
ఇంక అంతే.. బుజ్జి తుమ్మెదల కథ కంచికి..మనం ఇంటికి