మా బుజ్జి వినాయకుడి కోసం మేము చేసిన పూజా ఏర్పాట్లు
రంగురంగుల పువ్వుల మధ్యన ఠీవీగా కొలువుదీరిన విఘ్నేశ్వరుడు
స్వామికి నైవేద్యంగా సమర్పించిన రకరకాల పండ్లు, ఉండ్రాళ్ళు, రవ్వలడ్లు, వడపప్పు, పులిహోర, పెసరపప్పు పాయసం
అంటే 'మధుర' అనే నేను తీసిన ఛాయాచిత్రాలన్నమాట..!!
ఆ పువ్వులోని మకరందం మహా రుచిగా ఉందని, అదొక్కటే ఆరగించేయకుండా తన నేస్తాన్ని కూడా పిలిచింది. పిలవగానే జూ..జూమ్మంటూ వచ్చేసింది మరో బుజ్జి తుమ్మెద.