Garlic Vine!

హైదరాబాదు వెళ్ళే దారిలో ఉన్న 'హెరిటేజ్' ఇండస్ట్రీ ముందున్న పార్లర్ దగ్గర వాళ్ళు చాలా పొందిగ్గా పెంచుతున్న చిన్న పార్క్ లో చూశాను యీ తీగ. హెరిటేజ్ ఐస్ క్రీం తింటూ తీశాను యీ ఫోటోలు. పందిరి మీదకి అల్లించదగ్గ పెద్ద తీగ ఇది.

Mansoa alliacea - Garlic Vine. Deep lavender flowers with white throat fading to a paler lavender. Blooms heavily in the Spring and Fall. Will have some flowers on and off throughout the year. It is one of the most rewarding flowering vines that you can grow. Interestingly enough it smells like garlic. However, it doesn't smell if the plant is left alone, only when the leaves are crushed.








7 comments:

sphurita mylavarapu said...

India లో వున్నారా..అదీ సంగతి...ఈ మధ్య టపాలు ఏమీ లేవేంటా అనుకుంటున్నా...

కొత్త పాళీ said...

Interesting.
డిసెంబరు పూలలాగా ఉన్నై పూలు

మధురవాణి said...

@ స్ఫురిత,
ఇండియాలో లేనండీ! ఈ ఫోటోలు పోయిన సంవత్సరం వెళ్ళినప్పుడు తీశాను. :-)

@ కొత్తపాళీ గారూ,
డిసెంబరు పూలు చాలా చిన్నవిగా ఉంటాయి కదా! ఈ పువ్వులు కనీసం నాలుగైదు రెట్లైనా పెద్దవి వాటికంటే! పైగా గుత్తులు గుత్తులుగా పూస్తుంది. ఇదే రంగు డిసెంబరు పూలు మా అమ్మ ఓ పెద్ద మొక్క పెంచింది. ఆ ఫోటోలు త్వరలోనే పోస్ట్ చేస్తాను :-)

Unknown said...

మధురవాణి గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

sphurita mylavarapu said...

అయ్యో ఐతే పప్పులో కాలేసేశానన్నమాట...:)

మీరు ఇలా click చేసి అలా బ్లాగు లో పెడతారనుకుంటున్నా...ఇలా పాత ఫోటోలు పెట్టి నన్ను మోసం చేసి పైగా నవ్వుతున్నారా....:(

మధురవాణి said...

@స్ఫురిత,
లేదండీ.. ఇలా తీసి అలా పెట్టను ఫోటోలు. ఫొటోస్ ఫోల్డర్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు ఏది పెట్టాలనిపిస్తే అది పెట్టేస్తుంటాను. అంతే! :-)

హరే కృష్ణ said...

ఏంటండీ!గార్లిక్ వైన్ అంటే ఏదో విస్కీ అనుకోని వస్తే ఇలా డిసప్పాయింట్ చేసారు :((