piggy piggy choclates.. :)

ఈ బుజ్జి బుజ్జి పంది పిల్లలు ఏంటనుకున్నారు..? నోరూరించే చాక్లెట్స్.. పైగా అదృష్టాన్ని కూడా తీసుకొస్తాయని జర్మనీ దేశస్థుల నమ్మకం..!! అది సూచిస్తూ వాటి నోట్లో ఉన్నది జర్మన్ సెంట్స్ (పైసలు) కాయిన్ అన్నమాట.
చూడడానికి మాత్రం ఎంత ముద్దొస్తున్నాయో కదా.. వాటి కాళ్ళుగా, చెవులుగా ఉపయోగించింది ఏంటో తెలుసా.. బాదం పప్పు చెక్కలు..!
ఎంత చక్కటి పనితనమో కదా.. అభినందించి తీరాల్సిందే మరి :)


పళ్ళు.. పళ్ళు.. తాజా పళ్ళు..!!

Litschies... Apricots... Cherries..mmmm.. :)


జర్మనీ క్రిస్మస్ మార్కెట్లో హస్త కళారూపాలు

జర్మనీలో క్రిస్మస్ మార్కెట్లో చిన్న చిన్న స్టాల్స్ పెడతారని చెప్పాను కదా.. అక్కడ ఎక్కువగా చేత్తో తయారు చేసే గృహాలంకరణ సామగ్రి ఉంటాయి. ధర కూడా చాలా ఎక్కువే.. అక్కడ నేను తీసిన కొన్ని బొమ్మలు మీకోసం..!!

మరిన్ని విశేషాల కోసం ఇక్కడ కూడా చూడండి.