లడ్డూలు, అరిసెలు, బూందీ, కారప్పూస, ఇంకా.. జంతికలు! :)
ఈ ఫోటోలలోవన్నీ నిజంగా చేసినవే! పెళ్ళప్పుడు మా ఇంట్లో చేశారు. తయారు చేయగానే వేడి వేడిగా ఉన్నవాటిని ఫ్యాన్ కింద ఆరబెట్టమనే పని మాకు అప్పగించారు. నేనూ, మా తమ్ముడూ కలిసి ఇలా పద్ధతిగా ఆరబెట్టడమే కాకుండా ఫోటోలు కూడా తీశాం. ఇంకా మడత కాజాలు, పంచదార చిలకలు లాంటి వేరే స్వీట్లు కూడా చేశారు గానీ, అప్పుడు నాకు ఫోటోలు తీయడం కుదరలేదు. :(




