నీలి గోరింట పువ్వు

 

 

15 comments:

శేఖర్ పెద్దగోపు said...

మొదటి ఫోటో చాలా బాగా వచ్చిందండి...మా ఇంట్లో తెల్ల నీలి గోరింట మొక్కలు కూడా ఉండేవి. చెట్టు చుట్టూరా పూలతో భలే అందంగా ఉంటుంది ఈ చెట్టు.

శిశిర said...

మొదటిసారి చూస్తున్నాను మీ అందమైన 'మధుర ' చిత్రాలని. "ఇక్కడ కూడా నేనే..." అన్నారు. ఇందుగలదందులేదను సందేహము వలదు... ఎందెందు వెదకి చూసిన మధురవాణి అందందేగలదు. :):):)

మధురవాణి said...

@ శేఖర్ గారూ,
ఈ పువ్వుల్లో ముదురు గులాబీ రంగువి, వంకాయ రంగువి..అలా చాలా రంగుల్లో భలే బాగుంటాయి కదూ..!
నా చిన్నప్పుడు గులాబీలు ఎక్కువగా పూసేవి కాదు మా వీధిలో. అప్పట్లో వీటినే రెండు మూడు పూలు గుత్తిగా పెట్టి మా దగ్గర గులాబీలున్నట్టే మురిసిపోయేవాళ్ళం :)
@ శిశిర గారూ,
'మధుర చిత్రాలు' వీక్షించడానికి విచ్చేసినందుకు సుస్వాగతం. మరీ 'ఎందెందు వెదకి చూసినా...' అంత సీన్ లేదులెండి నాకు ;)

పరుచూరి వంశీ కృష్ణ . said...

baagunnayandi...

Rani said...

నీలి గోరింట అన్నారు ఇక్కడేమో పింక్ పూలు ఉన్నాయి.వీటిని చిలకముక్కు పూలు అని కూడా అంటారు కదా?

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగున్నాయి చిత్రాలు.

భావన said...

వీటిని చిలక మొక్క పూలు అని కూడా అంటారు కదు? నీలి గోరింట అని పేరు కవితాత్మకం గా విన్నా కాని తెలియదు నాకు దీనిని అంటారని. నేను ఆకుపచ్చ గా నీలం గా కనకాంబరాలు వుంటాయి కదా అలాంటీ పువ్వు వూహించుకున్న నీలి గోరింట అంటే. నాకు కూడా ఇష్టం ఈ పూలు అంటే. చాలా రంగులలో బలే అందం గా వుంటాయి.

మధురవాణి said...

@ వంశీ, విజయమోహన్ గారూ,
ధన్యవాదాలు :)
@ రాణి గారూ, ఆ మొక్కని, పువ్వుల్ని 'నీలి గోరింట' అనే అంటారండీ మా వైపు. చాలా రంగుల్లో ఉంటాయి ఇవి.
'చిలకముక్కు పూలు' అనే పేరు కూడా భలే బాగుంది :)
@భావన గారూ,
అయితే మీరూ, రాణీ గారూ ఒకే ప్రాంతం వాళ్ళా ఏమిటి..? ఇద్దరూ చిలకముక్కు పూలనే అంటున్నారు :)
నాక్కూడా భలే ఇష్టం..పువ్వులు..పేరూ..రెండూనూ.. ;)

పరిమళం said...

ఓ ఇక్కడ మీరేనా :) కూడలిలో చిత్రం చూసి నాకు బాగాపరిచయమున్న పువ్వేకాని ఇంతందంగా ఎవరుతీసారో చూద్దామని వచ్చా ....గోదావరి జిల్లాల్లో నీలగోరింతపూలని అంటారు .వీటి ఆకులు నూరి చేతికి పెట్టుకుంటే కొద్దిగా పండుతాయనుకుంటా !కృష్ణ ,గుంటూరు వైపు చిలకముక్కు పూలంటారు .చాలా అందంగా చూపించారు మాకు !

అక్షర మోహనం said...

prati photo oka HAIKU ..

అక్షర మోహనం said...

konni moggalu
oka puvvu-kommanu
ammanu chestoo..!

అక్షర మోహనం said...

peratlo poolu
peru edaitenemi
parimallalu manavi..

meeru neeligotinta annaru..memu chikamukku poolane antam

మధురవాణి said...

@ అక్షర మోహనం,
అద్భుతమండీ.. మీ హైకూలు :)

కొన్ని మొగ్గలు
ఒక పువ్వు - కొమ్మను
అమ్మను చేస్తూ..!

పెరట్లో పూలు
పేరు ఏదైతేనేమి
పరిమళాలు మనవి..!

అక్షర మోహనం said...

కొన్ని మొగ్గలు
ఒక పువ్వు-కొమ్మను
అమ్మనుచేస్తూ

ambadas g said...

me peru